త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తొలి చిత్రం ‘అతడు’. థియేటర్లో ఏ మేరకు ఆడింది అనేది పక్కన పెడితే… కల్ట్ క్లాసిక్ సినిమాల జాబితాలో చేరింది. ఎన్నిసార్లు టెలికాస్ట్ అయినా ..ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మరి చూసే సినిమా. ‘అతడు’ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఖలేజా’ చిత్రానికి థియేటర్లలో ఆశించిన స్పందన రాలేదు. కానీ, టీవీ లో సూపర్ హిట్ అన్నిటికంటే ముఖ్యంగా మహేష్ బాబులో కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు పరిచయం చేసింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన రెండు చిత్రాలు మహేష్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చాయి. వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతోందని వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ కార్యరూపం దాల్చడం లేదు. ఇటీవల మహేష్ బాబును కలిసిన త్రివిక్రమ్ ఓ కథ చెప్పాడనీ, దానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ గుసగుస. కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో త్రివిక్రమ్ పడ్డారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
ఎన్టీఆర్ సినిమా కంటే ముందే మహేష్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేయడానికి టైం పడుతుంది కనుక ఈ లోపు మహేష్ సినిమా పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
The post మరోసారి మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా!! appeared first on Media Updaters.
from www.mediaupdaters.com https://ift.tt/3c3gB0r
No comments:
Post a Comment